తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

0 8,598

హైదరాబాద్ ముచ్చట్లు ;

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఒడిశా తీరం వద్ద నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీంతో తమిళనాడు వరకు 1500 మీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న రాష్ట్రంలో విస్తారంగా కురిశాయి. కుమురంభీం జిల్లా వెంకట్రావుపేటలో అత్యధికంగా 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 

- Advertisement -

Tags:Heavy to very heavy rains in Telangana today!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page