అఫ్ఘాన్‌ పౌరులకు భారత్ ఈ- వీసా

0 8,714

అఫ్ఘానిస్థాన్‌ ముచ్చట్లు :

అఫ్ఘానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆ దేశం నుంచి మనదేశానికి రావాలనుకునే అఫ్ఘాన్‌ పౌరులకు ఈ-వీసా జారీ చేస్తామని భారతదేశం మంగళవారం ప్రకటించింది. మతంతో సంబంధం లేకుండా అఫ్ఘాన్లు ఎవరైనా ఆన్‌లైన్‌ ద్వారా అత్యవసర ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో జారీ చేసే ఈ కొత్త వీసాను ఈ-ఎమర్జెన్సీ ఎక్స్‌-మిసిలేనియస్‌ వీసాగా వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. భద్రతపరమైన అంశాలను పరిశీలించి ప్రాథమికంగా 6 నెలల కాలపరిమితితో ఈ వీసా జారీ చేయనున్నట్టు పేర్కొంది.

- Advertisement -

Tags:India e-visa for Afghan nationals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page