బంగాళాఖాతంలో అల్పపీడనం,ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు

0 806

అమరావతి ముచ్చట్లు:

దక్షిణ ఒడిసా- ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ ద్రోణి ఒడిసా, వాయవ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు విస్తరించింది. వీటిప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. తీరప్రాంతంలో ఈదురుగాలులు వీచాయి. రానున్న రెండురోజుల్లో.. ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటీ, రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

 

 

- Advertisement -

Tags:Low pressure in the Bay of Bengal, heavy rains in some parts of the North Coast

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page