కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం..

0 6,877

జగిత్యాల ముచ్చట్లు :

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఆనంద్ షాపింగ్‌మాల్‌లో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి ఎగసిపడుతూ క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే భవనంలోని నాలుగు అంతస్తులకు మంటలు ఎగబాకాయి. షాపింగ్‌మాల్‌లోని సామగ్రి కాలిబూడిదైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Tags:Massive fire in Korutla ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page