బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలంటూ న‌డిరోడ్డుపై ర‌చ్చ ర‌చ్చ‌

0 8,581

ముంబాయి ముచ్చట్లు :

బుల్లితెర‌పై రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు హిందీలోనే కాదు, ద‌క్షిణాది భాష‌ల్లోనూ బిగ్‌బాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా ఈ షోలో పాల్గొన‌డానికి సినీ సెల‌బ్రిటీలు వెనుకాడ‌రు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సెల‌బ్రిటీల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ ఓ ప్రాసెస్ ప్ర‌కారం జ‌ర‌గుతుంది. ఇప్పుడు ఓటీటీలోనూ బిగ్‌బాస్ ప్రారంభ‌మైంది. క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ చేస్తున్నారు. తాజాగా న‌టి రాఖీసావంత్ త‌న‌ను హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో తీసుకోవాలని కోరుతూ సూట్‌కేసుతో బిగ్‌బాస్ ఓటీటీ హౌస్‌కు చేరుకుంది. అక్క‌డ వినూత్నంగా త‌న నిర‌స‌న‌ను తెల‌య‌జేసింది. ఆ నిర‌స‌న‌ కూడా చాలా డిఫ‌రెంట్‌గా చేసిందండోయ్‌.. స్పైడర్ మేన్ బ‌ట్ట‌లు వేసుకుని ముంబై వీధుల్లో తిరుగుతూ,స్పైడ‌ర్ మేన్‌ను అనుక‌రిస్తూ, అభిమానుల‌తో క‌లిసి డాన్స్ చేస్తూ న‌డిరోడ్డుపై హ‌ల్ చ‌ల్ చేసింది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

- Advertisement -

Tags:Screaming on the sidewalk to get into the Big Boss

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page