సుప్రీంకోర్టుకు ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు

0 7,593

ఢిల్లీ ముచ్చట్లు :

సుప్రీంకోర్టులో న్యాయ‌మూర్తుల నియామ‌కం కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి కొలీజియం సిఫార‌సులు చేసింది. ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు స‌హా 9 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సీజే జ‌స్టిస్ హిమా కోహ్లి పేరు కూడా ఇందులో ఉంది. అలాగే, క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ నాగర‌త్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లు ఉన్నాయి. సీనియ‌ర్ జ‌డ్జి నాగ‌రత్న‌ ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా నియామకమైతే 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదే జ‌రిగితే తొలి మ‌హిళా సీజేఐగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.

 

- Advertisement -

Tags:The Supreme Court has three women judges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page