ఒవైసీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్

0 6,883

హైదరాబాద్ ముచ్చట్లు :

తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. భారత్ లో ఉన్న ఆఫ్ఘన్ రాయబారి తాలిబన్లను వ్యతిరేకిస్తున్నారని, ఆ దేశ ఉపాధ్యక్షుడు ఇంకా పోరాడుతున్నారని, అలాంటప్పుడు తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థం ఏమిటో ఒవైసీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. ఒవైసీ స్వయంగా కాబూల్ కు వెళ్లి, తాలిబన్లతో చర్చలు జరిపి, సమాచారం అందిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో సమంజసంగా ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ యూఏఈలో తలదాచుకున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Tags:BJP leader Vijayashanti fires on OYC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page