ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

0 8,626

-మూడేళ్లలో రూ.4,315 కోట్ల ఎక్సైజ్‌ సుంకం వసూలు

న్యూఢిల్లీ   ముచ్చట్లు:

- Advertisement -

కోవిడ్‌ సంక్షోభంలో సైతం ప్రజలపై ఎడాపెడా భారాలు మోపుతున్న కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తాజాగా మరో బాంబు పేల్చింది. సబ్సిడీ వంట గ్యాస్‌ సిలిండర్‌పై అమాంతంగా రూ.25 అదనపు భారం మోపింది.ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.859కి పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వంటగ్యాస్‌ ధర పెంచడం ఇది ఆరవ సారి. జనవరి 1నాటికి రూ.694గా ఉన్న సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.859కి చేరిందంటే ఈ ఏడున్నర మాసాల్లోనే రూ.165 పెంచేసిందన్న మాట. ఫిబ్రవరి 15న రూ.769, ఫిబ్రవరి 25న రూ.794, మార్చి 1న రూ.819, జులై 1న రూ.834, ఈ నెల 17న రూ.859కి చేరుకుంది.

-ఎక్సైజ్‌ డ్యూటీనే ప్రధాన కారణం:

వంట గ్యాస్‌ పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. గత మూడేళ్లలో రూ.4,315 కోట్లు ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. 2018-19లో రూ.1,547 కోట్లు, 2019-20లో రూ.1,573 కోట్లు, 2020-21లో రూ.1,195 కోట్లు వంట గ్యాస్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని వసూలు చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి సమాధానం ఇచ్చారు.

 

Tags:Duck six times in eight months .. Gas price increased from Rs 694 to Rs 859

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page