విద్యలో విప్లవమైన మార్పులు తెచ్చిన ఘతన సీఎం జగన్‌దే

0 6,903

– నాడు-నేడు పనులప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
– రూ:5.47 కోట్లతో మండలంలోని 20 పాఠశాలకు మహర్దశ
– 400 మందికి జగనన్న విద్యా కానుక పంపిణీ
– కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలి

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగంలో విప్లవమైన మార్పులు తెచ్చిన ఘతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేనని వైఎస్సాసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం పుదిపట్ల హైస్కూల్‌లో నాడు-నేడు పనులను ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ధీన స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు నాడు-నేడు కార్యక్రమం ద్వారా మౌళిక వసతులను కల్పించి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలతో, ప్రవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూడు దశలుగా ్య ధునీకరణ చేయడం ప్రభుత్వ లక్ష్యమని, తొలిదశలో మండలంలోని 20 పాఠశాలలకు రూ:5.47 కోట్లతో మరమ్మత్తులు చేసి ఆహ్లాదకరమైన వాతావరణంల నడుమ మౌళిక వసతులు కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక సదుపాయాలతోపాటు, ఆర్థికంగా చేయూతనిస్తోందని , కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు గతంలో శిథిలావస్థకు చేరువులో ఉండేవని, మౌళిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారని వీటిని దృష్టిలొ ఉంచుకొని జగనన్న ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నాడు నేడు ద్వారా అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వ బడులకు కొత్త దనం తెచ్చిందని సూచించారు. పుదిపట్ల పాఠశాలకు రూ:61 లక్షలు తో తొమ్మిది రకాల పనులు చేపట్టి జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా గుర్తింపు సాధించడ ం అభినందనీయమని కొనియాడారు. అనంతరం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 400 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలను కిట్‌లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి, బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పీఎంసీ కమిటీ చైర్మన్‌ ఉదయ్‌రెడ్డి,ఎంపీటీసీ నరసింహులు యాదవ్‌, ఎంపీడీఓ శంకరయ్య,ఏఈ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంలు పద్మజ, వేదవతి,తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Ghatana CM Jagande who brought about revolutionary changes in education

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page