భార్యతో చనువుగా ఉంటున్నాడని.. స్నేహితుడిని చంపేశాడు

0 6,874

భువనగిరి ముచ్చట్లు :

 

భార్యతో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడిపై అనుమానం పెంచుకొని హత్య చేశాడు తోటి మిత్రుడు. ఆత్మకూర్‌(ఎం) మండలం కొరటికల్‌కు చెందిన పెద్దిటి అశోక్‌రెడ్డి, చిన్నం అర్జున్, బండ సురేష్‌ స్నేహితులు. అశోక్‌రెడ్డి 2012లో ఇదే మండలం మోదుగుగూడెం గ్రామానికి చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్నేహితుడు చిన్నం అర్జున్‌ తరచు అశోక్‌రెడ్డి ఇంటికి వస్తుండేవాడు. ఇద్దరు కలిసి మద్యం సేవిస్తుండేవారు. ఆరు నెలల క్రితం తన భార్యతో అర్జున్‌ మాట్లాడుతుండగా అశోక్‌రెడ్డి గమనించాడు. అర్జున్‌ ప్రవర్తనపై అనుమానం పెంచుకొని అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. మరో స్నేహితుడైన బండ సురేష్‌, అశోక్‌రెడ్డి తన మామ ఉడుత నర్సింహ, బావమరిది ఉడుత నవీన్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పి తనకు సహకరించాలని కోరాడు. ఈ నెల 14 రాత్రి 8 గంటల సమయంలో అర్జున్‌ వద్దకు సురేష్‌ వెళ్లాడు. మద్యం తీసుకొని అశోక్‌రెడ్డి షెడ్డు వద్దకు రావాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన అర్జున్‌.. మద్యం తీసుకొని అశోక్‌రెడ్డి ఇంటికి బయలుదేరాడు. సమీపంలోకి రాగానే అతని వెనకాల అశోక్‌రెడ్డి, సురేశ్, శిరీష, ఉడుత నర్సింహ, నవీన్‌తో పాటు మరో వ్యక్తి మల్లెమాల శ్రీశైలం ద్విచక్రవాహనాలపై రావడంతో అర్జున్‌కు అనుమానం వచ్చింది. తప్పించుకునే ప్రయత్నిస్తుండగా కర్రతో అర్జున్‌ ముఖంపై మోదడంతో అతను కిందపడిపోయాడు. అర్జున్‌ మృతి చెందినట్లు నిర్థారించుకొని అక్కడినుంచి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: He was having an affair with his wife .. He killed a friend

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page