రహస్యంగా కత్రినా కైఫ్ ఎంగేజ్ మెంట్..!

0 8,790

ముంబాయి ముచ్చట్లు :

బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందంటూ బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా కత్రినా, నటుడు విక్కీ కౌశల్ ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొంత కాలంగా బాలీవుడ్ మీడియా వరుస కథనాలను ప్రచురిస్తోంది. తాజాగా జరిగిన రోకా ఫంక్షన్ లో కత్రినా, విక్కీ కౌశల్ లు ఉంగరాలు మార్చుకున్నారంటూ ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది. మరోవైపు వీరిద్దరికీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఓ టీవీ షోలో సోనమ్ కపూర్ సోదరుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ మాట్లాడుతూ కత్రినా, విక్కీ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని సంచలన ప్రకటన చేశారు.

 

- Advertisement -

Tags:Katrina Kaif’s secret engagement ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page