ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కిషన్‌రెడ్డి

0 8,598

తిరుపతి ముచ్చట్లు :

బీజేపీ ఆధ్వర్యంలో నిన్న తిరుపతిలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్ర సభలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మార్పు కోసం అధికారం అప్పగించిన ప్రజలకు సమన్యాయం చేయాలని జగన్‌కు సూచించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసినా, వేయకున్నా ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారని, కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ అలా చూడడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు పాటుపడుతున్న మోదీని అందరూ ఆశీర్వదించాలని కోరారు.

 

- Advertisement -

Tags:Kishan Reddy fires on AP government

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page