నేరం చేసిన ఎంతటివారికైనా శిక్ష తప్పదు, వదలి పెట్టే ప్రసక్తే లేదు.

0 7,942

తిరుపతి ముచ్చట్లు:

 

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, అవమానపరిచినా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.

- Advertisement -

తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి   వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్…

అలిపిరి పోలీస్ స్టేషన్ నందు ఇటీవల నమోదైన సైబర్ క్రైమ్ కేసును చేదించిన అలిపిరి పోలీసులు. ఈ కేసు వివరాలను పత్రికా ముఖంగా యస్.పి ప్రధాన కార్యాలయం నందు జిల్లా యస్.పి  వెల్లడించారు.

✅ యూట్యూబ్ లో ప్రముఖ టిక్ టాక్ మహిళ మార్ఫింగ్ వీడియోని అసభ్యకరంగా పోస్ట్ చేసి సొమ్ముచేసుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టు.

✅ సంపాదన కోసం అడ్డదారులు.

✅ మహిళ ఫిర్యాదుతో అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు.

✅ ముద్దాయి అరెస్ట్ లో కీలక పాత్రా పోషించిన సైబర్ క్రైమ్ సిబ్బంది.

✅ టిక్ టాక్ వీడియోలను తీసుకొని వాటిని అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్న నేరగాళ్ళు.

✅ మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

✅ మనం చేసే పోస్టులను ఎవరు చూడాలి, ఎందుకు పంపాలి అనే దానిపై జాగ్రత్త వహించాలి.

✅ సైబర్ నేరాల్లో బాధిత మహిళలు నిస్సంకోచంగా వచ్చి ఫిర్యాదు చేయాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.

జిల్లా యస్.పి:-

అలిపిరి పోలీస్ స్టేషన్ నందు తన యొక్క ఫోటోలను, వీడియోలను తెలిగ్రం, ఇంస్టాగ్రాం నందు తన ఫోటోలు వీడియోలను అసభ్యకరంగా సృష్టించి గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ చేసినారని తనది కాకపోయినా తన పెరుమీద లింక్ పెట్టి అన్ని గ్రూప్ లలో ట్రోల్ చేస్తూ తనతోపాటు తన కుటుంబాన్ని కూడా అవమానం కల్పిస్తున్నారని ఫిర్యాదు చేసారు. ఈ నేరం పై సైబర్ క్రైమ్ బృందంచే విచారణ చేపట్టి ఐదు మంది నేరగాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. సైబర్ ల్యాబ్ ద్వారా సోషల్ మీడియా, పి డిస్క్ అకౌంట్ లలో ట్రోల్ చేయబడుతున్న వీడియో లను వెంటనే తొలగించి, పోస్ట్ చేసిన వ్యక్తుల యొక్క అకౌంట్ లను తొలగించడం జరిగింది.ముఖ్యంగా ప్రజలు మహిళలు మీ యొక్క ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా యందు పోస్ట్ చేయునప్పుడు వాటిని ఎవరు చూడాలి, మనం ఎందుకు పోస్ట్ చేయాలి అనే వాటిపై స్పష్టత కలిగి ఉండాలి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదే విధంగా మీ కుటుంబ సభ్యులు ఫోటోలను పోస్ట్ చేస్తున్నప్పుడు మీ యొక్క ప్రొఫైల్ ను ఎందరు చూడాలి, ఎవరికి షేర్ చేయాలి అనే వాటిని చూసుకొని ప్రొఫైల్ లాక్ చేసుకోవాలి.

 

 

 

మహిళలపై సోషల్ మీడియా, టెలిగ్రాం, వాట్సాప్ లలో అసభ్యకరంగా ప్రవర్తించినా, అవమానపరచే విధంగా ఎవరైనా నేరాలకు పాల్పడితే వారిని ఎత్తి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాము. కఠినమైన శిక్షలు పడే ప్రయత్నం చేస్తాము.అక్రమ సంపాదన కోసం ఓ ప్రముఖ టిక్ టాకర్ మహిళ ఫోటోను మార్ఫింగ్ చేసి యుట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వీడియోలు ఉంచిన ఐదు మందిలో ఇద్దరు మైనర్ సైబర్ నేరగాళ్ళను అరెస్టు చేయడం జరిగింది. అలిపిరి పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తులో భాగంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడం జరిగింది. అరెస్ట్ అయిన ఐదుగురిలో ఒకరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా, మరో నలుగురు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు.సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం, తద్వారా వచ్చే అక్రమ సంపాదన కోసం వీరు ఈ దారుణానికి తెగబడ్డారని తెలిపారు. సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఎక్కడైనా సైబర్ వేధింపులకు గురయినట్లైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మీలో మీరే మదనపదకండి. ఒక్క కాల్ చేయండి పోలీస్ వారు మీ ముంగిట ఉంటారు. ఎంతటి వారినైనా వదిలి పెట్టం. బాధిత మహిళల వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.మహిళలు సాధారణంగా తమ పరువు పోతుందనే, ఇంట్లో పెద్దలు మందలిస్తారనో, సమాజంలో తెలిస్తే ఏమవుతుందో..ఏమో..అనే ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేయరనే బలమైన నమ్మకంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్ళు సొమ్ముచేసుకుంటున్నారు.

 

 

 

 

మహిళలపై నేరాలు, సైబర్ వేధింపులు, లైంగిక, ఈవ్ టీజింగ్ లేదా ఇతర ఎలాంటి నేరాలనైనా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నేరస్థులను పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరూ అధైర్య పడకుండా ‘దిశ’ పోలీస్ స్టేషన్, దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో గానీ, గ్రామ/వార్డు సచివాలయ సభ్యులకు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. బాధిత మహిళల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. అవసరమైనయెడల మహిళా పోలీస్ అధికారులచే త్వరితగతిన దర్యాప్తు చేసి నేరగాళ్ళను కటకటాల వెనక్కి పంపుతాము. జిల్లాలో పోలీస్ యంత్రాంగం 24×7 యస్.ఐ నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందుబాటులో ఉన్నారు. పోలీసులను మీ కుటుంబ సభ్యులవలె భావించి మీ సమస్యలను తెలియపరచి పరిష్కరించుకోవాలని జిల్లా యస్.పి  తెలియజేసారు.ప్రజలకు అతి ముఖ్యమైన విషయం. ఇప్పటి వరకు ఆన్లైన్ లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ళు సృష్టించిన సుమారు 25 ఆన్లైన్ నఖిలీ లింక్ లను గుర్తించడం జరిగింది. ఇది చైనా, హాంకాంగ్ ముఖ్య కేంద్రాలుగా పనిచేస్తుంది. మొదటి సారి పంపిన డబ్బులకి వారు డబ్బులు పంపిస్తారు. తర్వాత ఆశ చూపించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి నడుపుతున్న వెబ్ సైట్ ను క్లోజ్ చేస్తారు.కావున ప్రజలు ఇలాంటి లింక్ లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయరాదు. ఎక్కువ భాగం టెలిగ్రాం, ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్టాగ్రాం మొదలగు మంద్యమాల ద్వారా ఈ కార్యకలాపాలు జరుగుతుంది. కావున అందరు తగు జాగ్రత్తలు పాటించవలసినదిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ముద్దాయిల వివరాలు:

1.గుర్రం అరవింద్, వయసు 26, S/o సత్తి రెడ్డి, హైదరాబాదు.

2.పూవర్సన్ నాగరాజు, వయసు 26, S/o నాగరాజు, కుప్పం.

3.చల్ల నరేష్, వయసు 20, S/o రాజగోపాల్ నాయుడు, అనంతపూర్.

4.మైనర్

5.మైనర్

ఈ సమావేశం నందు అడిషనల్ యస్.పి అడ్మిన్  ఇ.సుప్రజ , ఈస్ట్ డి.యస్.పి మురళీకృష్ణ, అలిపిరి సి.ఐ దేవేంద్ర కుమార్, సైబర్ ల్యాబ్ సి.ఐ సుబ్రమణ్యం రెడ్డి, అలిపిరి యస్.పి ఇమ్రాన్ బాష మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: No matter how many offenders are punished, there is no mention of abandonment.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page