పుంగనూరులో జిక్సిన్‌ సిలిండర్ల కంపెనీ అధినేత రాహుల్‌కరణం మృతి

0 8,834

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని ఎం.సి.పల్లె వద్ద 23 ఎకరాలలో సుమారు రూ.57 కోట్లతో జిక్సిన్‌ గ్యాస్‌ సిలిండర్ల పరిశ్రమను నెలకొల్పుతున్న ఎండి రాహుల్‌కరణం గురువారం విజయవాడలో అనుమానస్పద స్థితిలో మరణించారు. ఈ సంఘటనతో పుంగనూరులోవిషాద చాయలు అలుముకున్నాయి. కాగా పరిశ్రమ పనులకు జూలై 1న మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి, చిత్తూరు ఎంపి రెడ్డెప్ప , కలెక్టర్‌ హరినారాయణ్‌, సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి కలసి భూమి పూజ చేసి, శంఖుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 900 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా ఎంపి మిధున్‌రెడ్డి ప్రణాళికలు సిద్దం చేశారు.
పనులు కొనసాగుతుండగా ఎండి మృతి చెందడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

- Advertisement -

మున్సిపాలిటికి రెండు ఆటోలు విరాళం….

మున్సిపాలిటిలోతడిచెత్త, పొడిచెత్తను వేరు చేసి తరలించేందుకు జిక్సిన్‌ కంపెనీ అధినేత రాహుల్‌కరణం ప్రత్యేకంగా తయారు చేయించిన రెండు ఆటోలను మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప , కలెక్టర్‌ హరినారాయణ్‌ చేతులు మీదుగా మున్సిపాలిటికి అందజేశారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Rahul Karanam, head of Jixin Cylinders Company, died in Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page