యువతిని దారి మళ్లించి ఆటో డ్రైవర్ అత్యాచారం

0 4,609

హైదరాబాద్ ముచ్చట్లు :
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఆటో ఎక్కిన యువతిని డ్రైవర్ దారి మళ్లించి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సంతోష్‌నగర్‌లో నివసిస్తున్న 20 ఏళ్ల యువతి మైలార్‌దేవ్‌పల్లిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విధులకు బయలుదేరిన ఆమె ఆటో ఎక్కింది. కొంతదూరం వెళ్లాక ఆటోను దారి మళ్లించిన డ్రైవర్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. సాయంత్రం సమయంలో ఆమె తేరుకుని నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

Tags:The young woman was diverted and raped by an auto driver

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page