కాసేపట్లో పెళ్లి అనగా షాకిచ్చిన వధువు

0 7,907

తెలంగాణ ముచ్చట్లు :

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన 19 ఏళ్ల యువతి ఇంటర్‌ పూర్తి చేయగా..ఆమెకు వంకేశ్వరం గ్రామానికి చెందిన బద్రు అనే యువకుడితో ఇటీవల వివాహం నిశ్చయించారు. పెళ్లికూతురు, ఆమె తరఫు బంధువులు వరుడు స్వగ్రామం వంకేశ్వరానికి చేరుకున్నారు. కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో ఈ పెళ్లి ఇష్టం లేదని, తనకు చదువుకోవాలని ఉందని వధువు చెప్పడంతో బంధువులు అవాక్కయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత సర్ది చెప్పినా ఆమె వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని ఆపేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తకుండా చూశారు.

 

- Advertisement -

Tags:Wedding for a while means sad bride

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page