యువతుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం!

0 7,604

తెలంగాణ ముచ్చట్లు :

యువతుల వేధింపులు భరించలేని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగింది. మొరిపిరాలకు చెందిన సందీప్ మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం అయింది. అందులో ఒకరితో సందీప్ ప్రేమలో పడ్డాడు. ఇటీవల మిగతా ఇద్దరు యువతులు సందీప్‌కు ఫోన్ చేసి ప్రియురాలు చనిపోయిందని, అందుకు కారణం నువ్వేనంటూ బెదిరించారు. ఈ నెల 12న మరోమారు ఫోన్ చేసిన యువతులు సందీప్‌ను బెదిరించారు. భయపడిపోయిన యువకుడు స్వగ్రామానికి చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 

- Advertisement -

Tags:Young man commits suicide after harassment by young women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page