వైఎస్ షర్మిల పార్టీకి ఇందిరా శోభన్ గుడ్ బై

0 8,563

తెలంగాణ ముచ్చట్లు :

వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలక నేతగా ఉన్న ఇందిరా శోభన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను అధ్యక్షురాలు షర్మిలకు పంపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె తెలిపారు. తనకు పార్టీలో పని చేసే అవకాశం కల్పించిన సోదరి షర్మిలకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, అమరవీరుల ఆశయాల సాధన కోసం తాను పోరాడుతూనే ఉంటానని ఇందిర తెలిపారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Indira Shobhan good bye to YS Sharmila’s party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page