‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ మళ్లీ వాయిదా!

0 8,715

హైదరాబాద్ ముచ్చట్లు :

 

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(రౌద్రం,రణం, రుధిరం). ఉక్రెయిన్‌ చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవల ఈ మూవీ టీం హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడిందనే వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రెండుసార్లు (2020 జూలై 30, 2021 జనవరి 08) విడుదల వాయిదా పడిన ఈ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అక్టోబరు 13న కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ కాదనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని భోగట్టా. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడమే కారణంగా తెలుస్తోంది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: ‘RRR’ movie postponed again!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page