శ్రీ‌వారి ఆల‌యంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

0 9,871

తిరుమల ముచ్చట్లు :

 

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం పూర్ణాహుతితో ముగిశాయి.ఇందులో భాగంగా శుక్ర‌వారం ఉదయం 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు.కాగా, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు క‌టాక్షించ‌నున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించ‌నున్నారు. ఆ తరువాత శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Sacrifice ceremonies ending with Poornahuti at Srivari Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page