గన్నవరం విమానాశ్రయానికి స్పైస్ జెట్ విమాన సేవలు రద్దు

0 8,591

విజయవాడ ముచ్చట్లు :

 

విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రం నుంచి విమాన సర్వీసులను స్పైస్ జెట్ సంస్థ రద్దు చేసుకుంది. 30 శాతం ప్రయాణికులు కూడా బుక్ కాని పరిస్థితి నెలకొనడమే దీనికి కారణమని వెల్లడించింది. నష్టాలతో విమాన సర్వీసులను నడపలేమని తెలిపింది. రెండు నెలల పాటు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ బుకింగ్స్ ను ఆపేసింది. విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లే స్పైస్ జెట్ విమానాలు రద్దు కావడంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ చాలావరకు ఖాళీ అయింది. రెండేళ్ల క్రితం వరకు స్పైస్ జెట్ విమానాల్లో 80 శాతానికి పైగా బుకింగులు ఉండేవి. ప్రస్తుతం అవి 30 శాతానికి పడిపోయాయి. విమానాశ్రయంలో రన్ వేను పెంచినప్పటికీ సర్వీసులు తగ్గిపోతున్నాయి.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags: SpiceJet cancels flights to Gannavaram Airport

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page