పుంగనూరులో ఇసుక కొరతతో సామాన్యులకు ఇక్కట్లు

0 9,296

-ఇసుక సమస్యను పరిష్కరించండి

-సిఐటియు డిమాండ్

 

- Advertisement -

పుంగనూరు  ముచ్చట్లు :

 

పుంగనూరు పట్టణంలో ఇసుక కొరత వలన సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారని ఇసుక సమస్య పరిష్కారం చేయాలని శుక్రవారం పుంగనూరులో జరిగిన సిఐటియు సమావేశం డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ అప్పోసప్పో చేసి ఇల్లు కట్టుకోవడానికి ప్రారంభించి ఇసుక కొరత వలన మధ్యలో నిర్మాణం ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత రెండు నెలలుగా సామాన్య ప్రజలకు మాత్రం అందుబాటులో లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇసుక రీచ్లు ప్రారంభించినప్పటికీ పుంగనూరులో మాత్రం నడవడం లేదు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉంటే బయట పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ప్రభుత్వ నిర్మాణాల పేరుతో అదనంగా తరలిస్తూ అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు.కరోనా సమయంలో ఆగిపోయిన పనులను ప్రారంభించడానికి ఇసుక సమస్య వచ్చి పడిందన్నారు. బడా వాళ్ళకు దొరికి,సామాన్య ప్రజలకు దొరకగకపోవడం ఏమిటని ప్రశ్నించారు. చిన్నచిన్న నిర్మాణాలు ఆగిపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి లేకుండాపోయింది. వ్యాపారులకు మాత్రం ఇసుక ఎంతైనా దొరుకుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇసుక సమస్య పరిష్కారం చేసి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.లేనిచో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు రమణ, మురళి తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags: Trouble for the common man with the shortage of sand in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page