ఏపీలో విద్యావిధానం దేశానికి తలమానికం..! ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

0 8,588

_నాడు–నేడు తో మారిన బడుల ముఖచిత్రం

_కార్పొరేట్ ను తలదన్నే స్థాయిలో సర్కారీ బడులు

- Advertisement -

_అందమైన కళాఖండాలతో అలరిస్తున్న వైనం

 

నారాయణవనం ముచ్చట్లు:

 

నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, విద్యా కానుక, నూతన విధానాల్లో బోధన.. ఒక్క మాటలో చెప్పాలంటే అంద్రరాష్ట్రంలోని విద్యా విధానం దేశానికే ఆదర్శం అని సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం కొనియాడారు. శనివారం నారాయణవనం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, మండల పరిధిలోని తుంబూరు పాఠశాలలు నాడు నేడు కార్యక్రమం లో భాగంగా నూతనంగా ఆధునీకరించిన పాఠశాల భవనాలు ప్రారంభించి, విద్యార్థి విద్యార్థులకు విద్యా కానుక కింద జగనన్న కిట్లను లాంఛనంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిమూలం వేదికపై మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గడిచిన రెండేళ్లలో విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయన్నారు. నాడు – నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా.. ఇంగ్లిష్‌ మీడియం, కార్పొరేట్‌ తరహా క్లాసు రూములతో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు బాటలు వేశారని దీంతో దేశం మొత్తం ఎటువైపు చూసేలా విద్యా వ్యవస్థలో నూతన శకానికి నాంది పలికారు అన్నారు.

 

 

 

2014– 2019 మధ్య 5.62 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్స్‌గా మారితే, గత రెండేళ్లుగా 6.63 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా చేరారని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత వైస్‌ చాన్సలర్‌ బాలమోహన్‌ దాస్‌ ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే కోనేటి గుర్తు చేశారు. విద్య కోసం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రూ. 25,714 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 1,60,75, 373 మంది లబ్ధిదారులకు లాభం చేకూరిందని, 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్లు వారి ఖాతాలలోకి నేరుగా వేశారన్నారు. నీతి అ యోగ్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2016 – 2018 మధ్య కాలంలో దాదాపు ఆరువేల స్కూల్స్‌ మూతపడ్డాయని బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఎన్‌.వెంకట్రావు స్వయంగా ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే చెప్పారు… ఏపీలో ముఖ్యంగా విద్య వైద్యం వ్యవసాయానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తన రాజకీయ జీవితంలో ఏనాడు చూడలేదని ఎమ్మెల్యే ఆదిమూలం పునరుద్ఘాటించారు..! కార్యక్రమంలో మండలానికి చెందిన ముఖ్య నాయకులు, అధికారులు ఉపాధ్యాయులు, విద్యార్థినీ ,విద్యార్థులు పాల్గొన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags: Education policy in AP is the flagship of the country ..! The origin of Mme Conte

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page