చిత్తూరులో హుండీలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న దొంగల ముఠా అరెస్టు

0 9,705

–   దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న దొంగల ముఠా లో ఇద్దరు వ్యక్తులు అరెస్టు,

-వారి వద్ద నుండి 30,050/- చోరిసోత్తు స్వాధీనం.

 

- Advertisement -

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా యస్.పి  సెంథిల్ కుమార్ IPS  ఆదేశాల మేరకు చిత్తూరు డి.యస్.పి  సుధాకర్ రెడ్డి , చిత్తూరు రూరల్ వెస్ట్ సి.ఐ  శ్రీనివాస రెడ్డి   పర్యవేక్షణ లో తవణంపల్లి యస్.ఐ K.రాజశేఖర్ , తవణంపల్లి సిబ్బంది కలిసి గత రోజులగా జిల్లా లో దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న ముఠా పై నిఘా పెట్టి, తవణంపల్లి మండలం, S.కృష్ణాపురం గ్రామంలోని వీరాంజనేయస్వామి గుడిలో ఈ నెల 16-08-2021 వ తేదిన రాత్రి దొంగతనం చెయ్యడానికి ప్రయత్నించిన ముద్దాయిల గురించి రాబడిన ఖచ్చితమైన సమాచారంపై  21-08-2021 వ తేదిన 8.30 AM గంటలకు ఈ క్రింది ఇద్దరు ముద్దాయిలను యాదమరి మండలం, బెంగళూరు – తిరుపతి హై వే రోడ్డులో, వరిగపల్లి లో కొత్తగా నిర్మించిన బ్రిడ్జి వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి గతనెల 26 వ తేదిన వారు గంగవరం మండలం, కీలపట్ల గ్రామంలో కోనేటిరాయ స్వామి గుడిలో దొంగతనం చేసిన డబ్బుల్లో 30,050/- రూపాయలను రికవరీ చేయడమైనది.

అరెస్టు కాబడిన ముద్దాయిల వివరములు:

1.         వడ్డే అమరనాథ్ @ అమర్, వయస్సు 21 సం”లు, S/o వడ్డే చిన్నబ్బ, D.No.1/37, దిగువ బందార్లపల్లి గ్రామం, బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా,
2.         కృష్ణాపురం భరత్ కుమార్, వయస్సు 23 సం”లు, S/o K.మురళి, D.No.6-64, ఇందిరమ్మ కాలనీ, తగ్గువారిపల్లి, బంగారుపాళ్యం గ్రామం మరియు మండలం, చిత్తూరు జిల్లా.ఈ కేసులో ప్రధాన నిందుతుడు పరారీలో వున్నాడు. త్వరలోనే అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసు లో ప్రతిభ కనబరచిన తవణంపల్లి యస్.ఐ K.రాజశేఖర్ మరియు తవణంపల్లి సిబ్బందిని అభినందించడమైనది.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags: Gang of thieves arrested for smashing hundis in Chittoor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page