జాతీయ వృద్ధుల దినోత్సవం…!!!

0 8,602

-వృద్ధాప్యమా…! కాదు పెద్ద బాల శిక్ష…!

 

అమరావతి ముచ్చట్లు:

 

- Advertisement -

మన వర్తమానానికి వెలుగులైనవాళ్లు. మన భవిష్యత్‌ నడకకు బాటలు వేసినవాళ్లు. నేటి మన జీవితాన్ని మన కంటే ముందే కలకన్నవాళ్లు. గతకాలపు కష్టాలను తరిమేసివర్తమాన అడుగులకు చేయూతనిచ్చి భవిష్యత్‌ బంగారుమయం కావాలని ఆకాంక్షించినవాళ్లు. బాల్యంలో కష్టాలను అనుభవించి, యవ్వనాన్ని మనకై త్యాగం చేసి, వృద్ధ్దాప్యంలో ఆదరణ కోరుకుంటున్నవారు. బిడ్డల భవిష్యత్తు కోసం చిన్న చిన్న సరదాలను సైతం త్యాగం చేసి అహరహం శ్రమించి వృద్ధులైనవాళ్లు. చివరి ఘడియల్లో వారి జీవితం సంతోషంగా గడుస్తుందా? అయినవారికి దూరమై, బతుకు భారమై, కష్టాలకు చేరువై, వృద్ధ్దాశ్రమాల పాలై దిక్కుమొక్కులేని చావు చస్తున్నారా? నాగరిక జీవనశైలి, పెరిగిన జీవనవేగం, వృద్ధుల అవసరాలకు ఖర్చుపెట్టాల్సి రావటం వంటి కారణాల వల్ల నేటి సమాజంలో వృద్ధులపట్ల నిర్లక్ష్యం, విముఖత పెరిగాయి. దీంతో కుటుంబసభ్యుల మమతానురాగాలకు దూరమై, అనారోగ్యం, వయోభారంతో వృద్ధాశ్రమాల్లో బతుకీడుస్తున్న వృద్ధుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ దుస్థితిని నివారించి వృద్ధుల సమస్యల పట్ల సమాజంలో విస్తృత అవగాహన పెంచేందుకు ఏటా ఆగస్టు 21న ‘

 

 

 

జాతీయ వృద్ధుల దినోత్సవం’ పేరిట జరుపుకొంటున్నాం. అనివార్యమైన వృద్ధాప్యం ఏ ఒక్క వ్యక్తికీ శాపంగా మారకుండా మనమంతా కృషిచేయాల్సిన సమయమిది. ఏ కుటుంబపు ఉన్నతికైనా ఆ ఇంటి పెద్దల కృషే ప్రధాన కారణం. బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలను ఎదురీది, తమ స్వేదాన్ని చిందించిన ఆ పెద్దలే వృద్ధులయ్యేసరికి తీవ్ర నిరాదరణకు గురవు తున్నారు.వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన చర్యలపై, కుటుంబసభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, పింఛన్లపై, ఉచిత వైద్యంపై చర్చించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికి, సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం.సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాం. ఏది చేసినా, ఎక్కడ చేసినా మానవాలి శ్రేయస్సు కోసమే. పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు ఇలా. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాం. మరి ఆగస్ట్‌ 21న ‘భారత జాతీయ వృద్ధుల దినోత్సవం’. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని జాతీయ స్థాయిలో ఈ సమస్య ను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి వారిపట్ల మన బాధ్యతలేమిటో తెలుసుకోవలసి ఉంది.

 

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: National Day of the Elderly … !!!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page