మగ తోడు లేకుండానే సొర చేపకు గర్భం

0 9,702

ఇటలీ ముచ్చట్లు :

 

సృష్టికి మూలం ఆడ, మగ జాతుల కలయిక అని మనకు తెలుసు. మగ జీవి అవసరం లేకుండానే ఆడ జీవి ప్రసవించడమనేది చాలా అరుదు. పరిణామక్రమంలో బాగా అభివృద్ధి చెందిన జంతుజాలంలో అయితే ఈ తరహాలో జననం అసాధ్యమనే చెప్పాలి. ఇటలీలోని ఓ అక్వేరియంలో మాత్రం ఈ అసాధ్యమే జరిగింది. సార్డీనియాలోని అక్వారియో కాలా గొనోనీ అనే అక్వేరియంలో గడచిన పదేళ్లుగా మగ సొర చేప లేదు. స్మూత్‌ హౌండ్‌ చేపల జాతికి చెందిన రెండు ఆడ సొరచేపలు మాత్రమే ఇందులో ఉన్నాయి. తాజాగా వీటిలో ఒకటి గర్భం దాల్చి, చక్కటి బుజ్జి సొరచేపకు జన్మనిచ్చింది. గతంలో మూడు జాతుల సొరచేపల్లో ఇలాంటి స్వీయ పునరుత్పత్తిని గుర్తించామని, ఈ జాతిలో ఈ తరహా ఘటన ఇదే తొలిసారని పరిశోధకులు చెబుతున్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Pregnancy of sorrel without male companion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page