అనంతపురం జిల్లాలో విషాదం పూజలు నిర్వహిస్తూ పూజారి మృతి

0 7,555

అనంతపురం ముచ్చట్లు:

- Advertisement -

దేవుని పూజలో నిత్యం తరించే ఆ పూజారిని.. అదే పూజ బలిగొంటుందని ఎవరూ ఊహించలేదు. అనంతపురం జిల్లాలోని శింగనమల సమీపంలో గంపమల్లయ్య స్వామి కొండపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. భక్తులకు కనిపించని దేవుడు.. పూజారికి మాత్రమే కనిపిస్తాడు అని ప్రజల విశ్వాసం. ఆయనలోనే దేవుడిని చూసుకుంటూ పూజలు చేస్తుంటారు. శ్రావణమాసం కావడంతో స్వామికి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ పాపయ్య అనే వ్యక్తి.. స్వామికి వంశపారంపర్యంగా పూజలు చేస్తూ ఉంటారు. శనివారం కూడా యథావిధిగా పూజ చేస్తున్నారు. ఈ క్రమంలో కొండ పైనుంచి గుహలోకి దిగే క్రమంలో ఒక్కసారిగా కాలు జారి లోయలో పడ్డాడు. ఊహించని ఈ ప్రమాదానికి అక్కడున్న భక్తులంతా షాక్ అయ్యారు. పూజారి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Priest dies while performing pooja in Anantapur district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page