పుంగనూరులో  నేషనల్‌ హ్యూమన్‌రైట్స్ మహిళా జాయింట్‌ సెక్రటరీగా సుజాత

0 9,794

పుంగనూరు ముచ్చట్లు:

 

నేషనల్‌ హ్యూమన్‌రైట్స్, ఉమెన్‌ అండ్‌ చైల్డ్ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్‌ సెక్రటరీగా పట్టణానికి చెందిన సూరపరాజు సుజాత ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు అఖిల్‌ నియామకపు ఉత్తర్వులు పంపారు. ఈ సందర్భంగా శనివారం సుజాత మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ , వారి హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ద్వారా మహిళలకు తగిన రక్షణ కల్పించేందుకు చట్టాలను వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పలువురు సుజాతకు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Sujatha as National Human Rights Women’s Joint Secretary in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page