విద్యార్థుల ఆరోగ్యమే ధ్యేయం- ప్రజారోగ్యానికే పెద్దపీట-సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 8,591

రామసముద్రం ముచ్చట్లు:

 

విద్యార్థుల ఆరోగ్యమే ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శనివారం స్థానిక పంచాయతి పరిధిలోనున్న కెసిపల్లి, గుంతయంబాడి, వనగానిపల్లి గ్రామాలలోనున్న ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాలతో పాటు కెసిపల్లిలోనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హైపో క్లోరైడ్ ద్రవాన్ని హరితరాయబారులచే పిచికారీ చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించడం కోసం పంచాయతీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం కరోనా మూడవ దశకు చేరుకోవడంతో స్థానిక శాసనసభ్యులు నవాజ్ భాష ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామాలలో ఎప్పటికప్పుడు మురికినీటి కాలువలు శుభ్రపరచడంతో పాటు గ్రామాలలో తడిచెత్త పొడిచెత్తను డంపింగ్ యార్డుకు తరలించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులలో హైపో క్లోరైడ్ క్లోరినేషన్ చేయించినట్లు చెప్పారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చిన్న పిల్లలు వస్తుండడంతో ఎవరికి అనారోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి ప్రజారోగ్యంపై ఆయనకు ఉన్న మక్కువ చూపించారని సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెసిపల్లి జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, స్థానిక యువ నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ, వాలింటర్లు దినకర్, ప్రదీప్, రెడ్డెమ్మ, హరితరాయబారులు రెడ్డెప్ప, ఆంజప్ప, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags; The aim is the health of the students , Peddapita for public health, Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page