గతంలో అమెరికా, రష్యాల జోక్యం తోనే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు ఈ పరిస్థితి

0 8,583

-దేశ అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకున్న అగ్రదేశాలు.

-ఆర్థిక, ఆయుధ సహకారం అందజేస్తూ మత సంస్థలకు ప్రోత్సాహం.

- Advertisement -

-ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడితే భారత దేశం పై ప్రభావం తక్కువే.

-ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై చర్చా వేదికలో మేధావుల అభిప్రాయం.

 

తిరుపతి ముచ్చట్లు:

 

ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకుని గతంలో అమెరికా రష్యా దేశాల విపరీతమైన జోక్యంతో నే నేడు ఆఫ్ఘనిస్తాన్కు ఈ పరిస్థితి వచ్చిందని మేధావులు అభిప్రాయపడ్డారు. శనివారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్) ఆధ్వర్యంలో ఎస్ వి యూనివర్సిటీ లోని సిప్ స్టడీస్ విభాగంలో ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ తాలిబాన్ల అధికారం భారతదేశంపై ప్రభావం అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కి ఆంధ్ర ప్రదేశ్ దేశ్ అభివృద్ధి పోరాట సమితి(ఆప్స్) వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ రాజారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య ఉపన్యాసకులుగా విచ్చేసిన సిప్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ఆచార్య జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ 1978 ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను ఆసరాగా చేసుకున్న రష్యా నజీబుల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని గమనించిన అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పై రష్యా కు ఉన్న ప్రభావాన్ని తగ్గించడానికి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి మత సంస్థ అయినటువంటి తాలిబాన్ సంస్థను చేరదీసి వాటికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించింది అంతర్యుద్ధానికి తెరలేపారని చెప్పారు. ఇలా పురుడుపోసుకున్న తాలిబాన్ సంస్థ నేడు అమెరికాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ లో అధికారాన్ని ఏర్పాటు చేసుకుందని తెలిపారు.

 

 

 

భారతదేశంపై తాలిబాన్ల ప్రభావం తక్కువే – ఆచార్య పి కృష్ణమోహన్రెడ్డి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ లు అధికారం చేపట్టిన దాని ప్రభావం భారతదేశంపై పెద్దగా ఉండబోదని తెలిపారు. ఎందుకంటే భారతదేశం అనేక సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్కు తన స్నేహ హస్తాన్ని అందిస్తోంది. భారత్ ఆఫ్ఘనిస్థాన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాలిబన్ల ప్రభుత్వం పాటైనా ఈ సహకారం భారత్ కొనసాగిస్తుంది. ఆఫ్ఘనిస్థాన్లో గత 20 ఏళ్లలో అమెరికా సహకారంతో నడిచిన టువంటి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి స్థానికంగా ఉన్నటువంటి అనేక సౌకర్యాలను కల్పించింది. తాలిబాన్ విజయం కాదు ఆమెరికా ఓటమి ఎన్. రాజా రెడ్డి ఆప్స్ రాష్ట్రఅధ్యక్షులు ఆప్గన్ ప్రజల ను నట్టేట వదిలేసి ఆమెరిక సేనలు వెను దిరిగాయి విజయ గర్వం తో కాదు ఘోర పరాజయాన్ని మూటగట్టు కొని వెళ్లింది. ఆమెరిక ఓటమి కొత్తేమీ కాదు ఇరాన్, లిబియ, క్యూబా, వెనుజుల లాల్లో కూడ ఓటమి పాలైంది అప్గన్ దేశాన్ని ప్రజలే కాపాడుకోవాలి సమాజం మోతమ్ ఆప్గన్ కు మద్దతు ఇవ్వలి భారత్ పైన తీవ్ర వాదులు కన్నెత్తి కూడ చూడ కుండ గళమెత్తలి ఆచార్య యమ్ ప్రయాగ- మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాల పై ప్రపంచవ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబాన్లు అధికారంలోకి వస్తే మానవ హక్కులు తీవ్రంగా అణిచివేయబడ్డతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆఫ్ఘనిస్తాన్ తో భారత్కు చారిత్రక సంబంధాలు ఉన్నాయి కాబట్టి భారత్ తన సహకారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది.

 

 

 

 

ఇప్పుడు అధికార మార్పిడి జరిగితే భారత్ సంబంధాలు కొనసాగించడంపై సందిగ్ధత నెలకొంది. పాకిస్థాన్ తాలిబాన్లతో కలిసిపోయే ప్రమాదముంది. మొహాన్ రెడ్డి రిటైర్డ్ ఆర్మీ యూనియన్ ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అధికారంలోకి వస్తే పాకిస్తాన్ భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు అన్నీ కలిసి భారత్ పై దాడి చేసే ప్రమాదం ఉంది కావున భారత సైన్యం అప్రమత్తంగా ఉండాలి. తాలిబాన్ ఎంతో కాలం అధికారంలో ఉండలేరు. లాయర్ కే. వీ. ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా భారతదేశం వెంటనే స్పందిస్తుంది. తాలిబన్ల అధికారం ఆఫ్ఘనిస్థాన్లో ఎంతో కాలం కొనసాగదు. మానవ హక్కుల పరిరక్షణకు భారత్ తన వంతు సహాయం అందిస్తుంది. తాలిబాన్ పరిపాలనలో మహిళలకు రక్షణ ఉండదు ఆచార్య ఎం. పద్మజ తాలిబాన్ల ఆధ్వర్యంలో మహిళలపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. అక్కడ మహిళలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలి. దీని పై యునైటెడ్ నేషన్స్ లాంటి సంస్థలు ముందుకు రావాలి. కవలలతో ప్రపంచమే కలవర పాడుతున్నది. సీ. బాల సుబ్ర మణ్యం మానవ హక్కుల కౌన్శిల్ బయటకు పోరాడు తున్నట్టే కనిపించిన పరస్పరం పెంచి పోషించుకునే సామ్రాజ్య వాదం, మతోన్మాదం.. రెండూ ప్రమాదకర కవలలే నని, మతోన్మాద సంస్థలు కూడ సామ్రాజ్య శక్తుల చేతుల్లో సందర్బం బట్టి పావులుగా మారుతాయి.

 

 

 

 

ప్రస్తుతం శాంతి మంత్రం జపిస్తున్న అమెరికా, రష్యా చైనా దేశాలే ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం అం జరుగుతున్న రావణ కష్టానికి కారణం. మాల మహానాడు అధ్యక్షులు చెంగయ్య తాలిబన్ల అధికారం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపనుంది. పాకిస్థాన్కు కొరకరాని కొయ్యగా మారిన భారత్ భారత్ ను దెబ్బతీయడానికి తాలిబన్లు సహకరిస్తారు. రఫీ- ఆప్స్ జిల్లా అధ్యక్షులు సామ్రాజ్యవాద కాంక్ష తో అమెరికా చేసినటువంటి కుట్రలో భాగంగమే తాలిబాన్ అభివృద్ధి చెందింది. దీని ప్రభావం పరోక్షంగా భారతదేశంపై ఎక్కువగా ఉంటుంది. ఆదినారాయణ- విద్యార్థి. తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడం తో ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జరిగే వ్యాపార లావాదేవీలకు తీవ్ర ప్రభావం చూప నుంది. ఈ కార్య క్రమంలో ప్రో. విజయ కుమార్ రెడ్డి, మురళి క్రిష్ణా, జనార్దన్, జి. రంజిత్ కుమార్, చిన్నమ్ పెంచులయ్య, ఏ ఐ టీ యు సీ పీ. మురళి, మానవ హక్కుల కౌన్ శిల్ నాయకులు మనీష్ గుప్త, సేకరయ్య, మహేం ద్ర, ఆనంద, రాజా రామేశ్, మాసుమయ్య, ముస్లిమ్ జె ఏ సీ గౌస్, ఎస్ పీ షా, అక్బర్, విద్యార్టీ నాయకులు అదినారాయన, సుదర్శన్, జీవన్ తడితరులు పాల్గొన్నారు. తీర్మాణాలు :- 1. రాష్ట్ర ములో ప్రతి యూని వర్సిటీ లో ఇలాంటి మేడావుల చర్చా గోస్టీ నిర్వ హించాలి. 2. భారత్ ఆప్గాన్ ప్రజలకు అండగా నిలవాలి. 3. మహిళల హక్కులను ఆప్గాన్ లో కాపాడాలి. 4. మన దేశంలో ముఖ్యం గా కాశ్మీర్ లోయ లో తీవ్ర వాడులు చొరబడ కుండా అప్రమత్తంగా ఉండాలి. 5. అమెరికా ఆప్గాన్ లకు రక్షణ కల్పించాలి. 6. తాలిబాన్ లు భారత్ ఎంబసీ పై దాడి చేయడాన్ని తీవ్రంగా సమావేశం ఖండించింది.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: This is the situation in Afghanistan now, with the intervention of the United States and Russia in the past

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page