కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ

0 8,584

త్రిపుర ముచ్చట్లు :

 

శతాధిక వసంతాల పార్టీ కాంగ్రెస్‌కు గడ్డుకాలం నడుస్తోంది. సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. నిన్నగాక మొన్న సీనియర్ నేత సుస్మితా దేవ్ కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. హఠాత్తుగా పార్టీకి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలుపుతూ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఈ అలజడి సద్దుమణగక ముందే మరో సీనియర్ నేత, త్రిపురలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న పిజూష్ కాంతి బిస్వాస్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ‘ఈ రోజు నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. రాజకీయాల నుంచి కూడా విరమణ తీసుకుంటున్నా. కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -

నిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Blow upon blow to Congress

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page