చిన్నారి ఆపరేషన్ కు రూ.17.5లక్షలు సాయం చేసిన సీఎం జగన్

0 8,593

అమరావతి ముచ్చట్లు :

 

ముఖ్యమంత్రి జగన్ తక్షణ స్పందనతో ఒక చిన్నారి ప్రాణం నిలిచింది. శ్రీకాళహస్తి బీపీ అగ్రహారానికి చెందిన జగదీశ్, లక్ష్మి దంపతులకు మునీశ్వర్ (10) అనే కొడుకు ఉన్నాడు. ఈ చిన్నారికి జన్యుపరమైన లివర్ సమస్య ఉంది. దీని కారణంగా పచ్చ కామెర్లు, ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కలిసి సహాయం కోరారు. ఆయన వెంటనే స్పందించి చెన్నైలోని గ్లెనిగల్ గ్లోబల్ ఆసుపత్రికి పంపారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు క్లిష్టమైన ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని… దీనికి రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే చొరవతో రూ.17.5 లక్షలకు ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన జగన్ రూ. 17.5 లక్షలను చెల్లించడానికి అధికారులకు అనుమతి ఇచ్చారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ ను విజయవంతం చేశారు.

- Advertisement -

నిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; CM Jagan donates Rs 17.5 lakh for child operation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page