యువ‌కుడి పొట్ట‌లో రూ.11 కోట్ల విలువైన కొకైన్..

0 9,881

బెంగళూరు ముచ్చట్లు :

 

డ్ర‌గ్స్‌ను త‌ర‌లించ‌డానికి కేటుగాళ్లు ఎన్నో మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ దొరికిపోయి జైలుకు వెళ్తున్నారు. దుబాయ్‌ నుంచి బెంగ‌ళూరు విమానాశ్ర‌యానికి వ‌చ్చే ఓ ఫ్లైట్ ఎక్కాడు ఆఫ్రికాకు చెందిన ఓ వ్య‌క్తి. విమానంలో అత‌డు ఆహారం తిన‌లేదు, పానియాలూ తాగ‌లేదు. దీంతో అత‌డిపై సిబ్బందికి అనుమానం వ‌చ్చింది. బెంగ‌ళూరు విమానాశ్ర‌య అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. విమానం దిగ‌గానే అత‌డిని అదుపులోకి తీసుకున్న అధికారులు స్కాన్ చేయ‌గా అత‌డి పొట్ట‌లో కొకైన్ ఉన్న‌ట్లు తేలింది. ద‌క్షిణాఫ్రికాలోని ఓ డ్ర‌గ్స్ వ్యాపారి ఆ వ్యక్తిని దుబాయ్ మీదుగా బెంగ‌ళూరుకు పంపించిన‌ట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Cocaine worth Rs 11 crore in young man’s stomach

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page