అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

0 10,121

రామసముద్రం ముచ్చట్లు:

 

చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే రాఖీ. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. రక్షాబంధన్ పండుగ చాలా ఉత్సాహంతో జరుపుకున్నారు. రాఖీ అంటే ‘రక్షణ’ అని అర్థం. రాఖీ పండుగనే ‘రక్షా బంధన్’ అని కూడా పిలుస్తారు. ‘రక్ష’ అంటే రక్షించడం, ‘బంధన్’ సూత్రం కట్టడం అని అర్థం. అన్న లేదా తమ్ముడు విజయం దిశగా అడుగేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ.. సోదరి రాఖీ కడుతుంది. సోదరుడి విజయాన్ని సోదరి కాంక్షిస్తే.. ఏ కష్టమైనా నీకు అండగా నిలుస్తానని సోదరుడు హామీ ఇస్తాడు. సొంత అన్నా చెల్లెల్లె కాకుండా అభిమానం ఉన్న ప్రతి మహిళ, బాలికలు, చిన్నపిల్లలు కూడా వారి అన్న దమ్ములకు , ఆత్మీయులకు అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా రాఖీ కడతారని ,

 

 

- Advertisement -

సోదరుడు.. నాన్న తర్వాత నాన్నగా, సోదరి.. అమ్మ తర్వాత అమ్మగా.. జీవితాంతం రక్షణగా నిలుస్తారని,  ప్రేమను పంచుతారు. ఏళ్లవేళల అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక ఈ రక్షాబంధన్ పండుగ అని గుర్తు చేశారు. కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారని,  అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారని గుర్తు చేశారు. తోబుట్టువులచే రక్షాబంధనాన్ని పొందడం సంప్రదాయంగా వస్తున్నది. భారతీయ కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి ఇది చిహ్నం. అందులోనూ అక్కాచెల్లెళ్ళకు అన్నదమ్ముల అనురాగం జీవితాంతం ఉండవలసిన బంధం – అని గుర్తు చేసే పర్వదినం. ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి అని మన భావన. ఆ శక్తినుంచి లభించే రక్షణ దేవతలందరి కాపుదలను అనుగ్రహిస్తుందనే దృష్టితో ఈ పర్వాన్ని ఏర్పరచారు. సోదరిచేత కట్టబడిన రక్షాబంధనం అరిష్టాలను పోగొడుతుంది.

 

 

సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతా అనుబంధం పెంచేది ఈనాటి రాఖీ పండుగే. సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, నొసట కుంకుమ దిద్ది, హారతినిచ్చి, వారి కుడి చేతికి రక్ష కడతారు. సోదరులు అక్షతలు వేసి తమ సోదరిని ఆశీర్వదించి ఆమెకు కానుకలు సమర్పిస్తారు. సోదరి తన సోదరునకు భోజన పిండివంటలు పెట్టి తృప్తి పరుస్తుంది. సోదరుడు తన సోదరిని, ఆమె సౌమంగళ్యాన్ని కాపాడటం కర్తవ్యంగా భావించాలి. పరస్పరం రక్షణకు ప్రతిన పూనే సమైక్య భావ నిలయమే ఈ పండుగ. ఈ సందర్భంగా రాఖీ కట్టిన సోదరిలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరేలా బహుమతులు అందచేశారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags: Rakshabandhan is a symbol of Anna’s younger sister’s attachment

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page