దళితుల దాడులపై యువత ఉధ్యమించాలి-యమలా సుదర్శనం

0 8,748

పుంగనూరు ముచ్చట్లు:

 

దళితులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు యువత ఉధ్యమించాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం పిలుపునిచ్చారు. ఆదివారం అంబేద్కర్‌ భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.ఆర్‌.అశోక్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధులుగా స్వరాజ్‌ ఇండియా జాతీయ సభ్యులు కరీముల్లాసయ్యద్‌ముక్తర్‌, హ్యూమానిటిహ్యాండ్స్ అధినేత జయలక్ష్మి హాజరైయ్యారు. సుదర్శనం మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు తీవ్రమైందని, అంబేద్కర్‌ ఆశయాలను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు దళిత యువత ఉధ్యమం బాట పట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్‌, మనోహర్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన కార్యవర్గం….

జిల్లా అధ్యక్షుడుగా కెలవాతి సుబ్రమణ్యం, గౌరవ అధ్యక్షులుగా హరి, ఉపాధ్యక్షులుగా మనోహర్‌, సుభాష్‌ , జయశంకర్‌, అధికార ప్రతినిధులుగా మోహన్‌, రవి, ప్రధాన కార్యదర్శిగా మురగయ్య, సహాయ కార్యదర్శులుగా వెంకటాచలం, శేషాద్రి, సహదేవ, సుధాకర్‌, ప్రచార కార్యదర్శులుగా తిప్పయ్య, సూర్యనారాయణ, రమణ, కోశాధికారిగా మోహన్‌, కమిటి సభ్యులుగా చంద్రశేఖర్‌, అరుణయ్య, నాగరాజు, రామచంద్ర, కుమార్‌, నారాయణ, జిల్లా యూత్‌ అధ్యక్షులుగా ప్రదీప్‌కుమార్‌, మదనపల్లె డివిజన్‌ అధ్యక్షులుగా లక్ష్మిపతి లను ఎన్నుకున్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Youth should mobilize against Dalit attacks-Yamala Sudarshan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page