ఎద్దు అంతిమ సంస్కారానికి 3 వేల మంది హాజరు

0 8,604

లక్నో ముచ్చట్లు :

మరణించిన ‘బాబూజీ’ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పూజారి మంత్రాలు పఠిస్తున్నాడు. అక్కడ గుమికూడిన ప్రజలు పూజారి ఆజ్ఞల ప్రకారం చేస్తున్నారు. దాదాపు 3 వేల మంది జనాలు బాబూజీ అంతిమ సంస్కారాలకు హాజరు అయ్యారు. ఇంత మంది అభిమానాన్ని చూరగొన్న బాబూజీ ఎంత అదృష్టవంతుడో కదా అనుకుంటున్నారా.. అయితే అక్కడే ఉంది ట్విస్ట్‌. ఇంత భారీ ఎత్తున జనాలు హాజరయ్యింది మనిషి కర్మకాండ కార్యక్రమానికి కాదు.. ఎద్దుది. వినడానికి కాస్త వింతగా ఉన్న ఇది వాస్తవం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ షహరాన్‌పూర్‌ కుర్ది గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు ముద్దుగా ‘బాబూజీ’ అని పిలుచుకునే ఎద్దు 20 ఏళ్లుగా కుర్ది గ్రామంలో ఉంటుంది. గ్రామస్తులు ఆ ఎద్దును భగవంతుడి బహుమతిగా భావించేవారు. అలా 20 ఏళ్లుగా గ్రామస్తుల కుటుంబంలో భాగస్వామిగా ఉన్న బాబూజీ ఈ నెల 15న మృతి చెందింది.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:3 thousand people attended the bull funeral

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page