సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాలి- టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

0 8,846

తిరుమ‌ల‌ ముచ్చట్లు :

 

– వ‌సంత మండ‌పంలో ముగిసిన స‌క‌ల కార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణం

- Advertisement -

– సెప్టెంబ‌ర్ 2వ తేదీ నుండి షోడ‌శ‌దిన బాలకాండ పారాయ‌ణ దీక్ష‌

 

సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని, క‌రోనా నుండి ప్ర‌పంచం విముక్తి క‌ల‌గ‌ల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌లో 30 రోజుల పాటు నిర్వ‌హించిన స‌క‌ల కార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణం సోమ‌వారం మ‌హా పూర్ణాహుతితో ముగిసింద‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. మ‌హాపూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో దంప‌తులు పాల్గొన్నారు.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో వ‌సంత మండ‌పంలో స‌క‌ల కార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణంలోని శ్లోకాల పారాయ‌ణం, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో జ‌ప‌-త‌ర్ప‌ణ-హోమాలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ లోక సంక్షేమం కోసం, క‌రోనా రెండ‌వ వేవ్‌ అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ రెండు సార్లు 16 రోజుల పాటు షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌, ఒకే రోజు 17 గంట‌ల పాటు నిర్విరామంగా సుంద‌ర‌కాండ పారాయ‌ణం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా 30 రోజుల పాటు యుద్ధ‌కాండ పారాయ‌ణం, స‌క‌లకార్య‌సిద్ధికి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణం నిర్వ‌హించిన‌ట్లు వివ‌రించారు.

క‌రోనా మూడ‌వ వేవ్ చిన్న పిల్ల‌ల‌ను ఇబ్బంది పెడుతుంద‌ని ప్ర‌భుత్వాలు, వైద్య సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో బాల‌ల క్షేమం కోసం సెప్టెంబ‌ర్ 2వ తేదీ నుండి బాల‌కాండలోని శ్లోకాల పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో శ్రీ‌ రామ‌చంద్ర‌మూర్తి బాల్య విశేషాలు, రాక్ష‌స సంహారం, శివ‌ధ‌న‌స్సు విరిచి సీతాదేవిని క‌ల్యాణం చేసుకోవ‌డం త‌దిత‌ర అంశాలు ఉన్నాయ‌న్నారు. ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా భ‌క్తులు ఈ ప‌రాయ‌ణంలోని శ్లోకాల‌ను వీక్షించిన‌, ప‌ఠించిన‌, శ్ర‌వ‌ణం చేసిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంద‌న్నారు.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో :

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థ‌నా మందిరంలో ప్ర‌తి రోజు స‌క‌ల కార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణంలో భాగంగా క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ‌కు విశేష మంత్రాల‌తో జ‌ప‌-త‌ర్ప‌ణ-హోమాదులు నిర్వ‌హించారు. లోక క్షేమం కోసం 30 రోజుల పాటు ఉపాస‌కులు అకుంఠిత‌ దీక్ష, శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ సీతాల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామి స‌మేత శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం 27 ల‌క్ష‌ల సార్లు జ‌పించారు. జ‌పంలో ప‌ద‌వ వంతు ఆవు పాల‌తో త‌ర్ప‌ణం, త‌ర్ప‌ణంలో 10వ వంతు హోమాలు నిర్వ‌హించారు.

మ‌హా పూర్ణాహూతి సంద‌ర్బంగా సోమ‌వారం ఉద‌యం మూల మంత్ర హోమాలు, శ్లోక హోమాలు, మండ‌ప దేవ‌త హోమాలు, అంగ హోమాలు, పౌష్ఠిక హోమాలు, శాంతి హోమాలు, జ‌యాతి హోమం, కుంభారాధ‌న జ‌రిగింది. త‌రువాత స‌మ‌స్త దోషాలు తోల‌గి పోవాల‌ని అభిజిత్ ల‌గ్నంలో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సంక‌ల్పం, హోమ‌ద్ర‌వ్య పూజ‌, బ‌లి ప్ర‌దానం, ద్ర‌వ్య స‌మ‌ర్ప‌ణ‌, వ‌సోర్ధారా హోమం, పూర్ణాహుతి నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

వ‌సంత మండ‌పంలో :

అంత‌కుముందు తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్టాడుతూ రామాయ‌ణంలోని బాల‌కాండ, అయోధ్య‌కాండ‌, అర‌ణ్య‌కాండ‌, కిష్కింధ‌కాండ‌, సుంద‌ర‌కాండ‌, యుద్ధ‌కాండలోని ప్ర‌ధాన‌మైన స‌ర్గ‌ల‌ను పారాయ‌ణం చేసిన‌ట్లు తెలిపారు. ఒక్కో రోజు ఒక్కో ధ‌ర్మ‌కార్యం సిద్ధించాల‌ని కోరుతూ ఆయా కాండ‌ల్లోని ప్ర‌ధాన‌మైన స‌ర్గ‌ల‌లోని శ్లోకాల‌ను పారాయ‌ణం చేసిన‌ట్లు వివ‌రించారు. శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణంలో 20 కామ్య‌ముల‌కు సంబంధించిన‌ శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయ‌ణం చేశార‌న్నారు.

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఊంజ‌ల సేవ మండ‌పం

సీతా, లక్ష్మణ స‌మేత శ్రీ రామచంద్రమూర్తి ఉత్స‌వ‌మూర్తులు కొలువైన‌ ఊంజల్ సేవ మండ‌పం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. స్వామివారికి ఎదురుగా శ్రీ బాల ఆంజనేయ స్వామి, శ్రీ అంజనా దేవి ప్రతి రూపాలు కూడా ఉంచబడ్డాయి.

టిటిడి ఎస్వీ సంగీత నృత క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం, ” ‌భావయామి రఘు రామమ్…… ” ‌, అనే శ్రీ స్వాతి తిరునాల్ రచించిన సంకీర్తనను సుమ‌ధురంగా అల‌పించారు. బాలకాండ నుండి యుద్ధకాండ వరకు ఉన్న అన్ని ఘ‌ట్టాల‌ను ఈ సంకీర్త‌నలో పొందుప‌రిచారు.

ఎస్వీబీసి సిఇవో శ్రీ సురేష్ కుమార్, ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, పండితులు పాల్గొన్నారు.

 

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:All living things in creation must be healthy – TTD Addition Evo AV Dharmareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page