ముంబై- నాగపూర్ మార్గంలో బుల్లెట్ రైలు

0 7,580

మహారాష్ట్ర ముచ్చట్లు :

అవసరం అనుకుంటే ముంబై- నాగ్‌పూర్‌ మార్గంలో బుల్లెట్‌ రైలు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్‌ దన్వే అన్నారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు పనులు జరుగుతుండగా దాన్ని నాగ్‌పూర్‌ వరకు పొడిగించే అంశాన్ని మంత్రి స్వయంగా ప్రస్తావించారు. కరోనా కారణంగా రూ. 36,000 కోట్ల నష్టం వాటిల్లిందంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహెబ్‌ దన్వే అన్నారు. ముఖ్యంగా ప్యాసింజర్‌ రైళ్లు నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందంటూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని జాల్నా స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను రైల్వేశాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:Bullet train on Mumbai-Nagpur route

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page