దళిత నాయకుడు మునిరత్నం కు ఏమీ జరిగినా సి.ఐ బాధ్యత వహించాలి..!

0 9,742

-వి.కోట మండలం, పట్రపల్లి దళిత వాడకు చెందిన మునిరత్నం ఏమైనట్లు ?

-వి.కోట సి.ఐ మరియు సర్పంచ్ కొడుకు నాగరాజు అతని అనుచరుల వల్ల ప్రాణ హాని ఉంది.!

 

- Advertisement -

వి.కోట ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం,వి.కోట మండలం,పట్రపల్లి దళిత వాడకు చెందిన బి.మునిరత్నం  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సంబంధించిన 60 కుటుంబాల ఇంటి జాగాల విషయంగా మండల రెవెన్యూ అధికారులతో పోరాడుతున్నారు. ఆ భూమిని చదును చేసుకోమని గతంలో మండల రెవెన్యూ అధికారులు చెప్పాగా బడుగు బలహీన వర్గాల వారు లక్షల రూపాయలు వెచ్చించి గుట్టల్ని చదును చేశారు. లక్షల విలువచేసే భూముల్ని దళిత వర్గాలకా అని సర్పంచ్ కొడుకు నాగరాజు అతని అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా 10 ఇండ్లుకు కడగాల్లు వేశారు. ఈ విషయంగా దళిత వాడకు చెందిన బి.మునిరత్నం లోకాయుక్త లో ఫిర్యాదు చేశారు.ఆ భూమిని ఆక్రమించిన వారికి అనుమతులు మంజూరు చేసిన రెవెన్యూ అధికారులకు నోటీసులు ఇప్పించారు. దీన్ని సహించలేని నాగరాజు  స్థానిక సి.ఐ. సహకారం తో వీరిపై తహసిల్దార్ గారి ద్వారా దళిత నాయకుడు బి.మునిరత్నం పై తప్పుడు కేసు బనాయించి అతని పై వేట సాగించారు. 22 వ తేది నాగరాజు అతని అనుచరుల ద్వారా ఫోన్ చేయించి పలమనేరు కి పిలిపించుకొని పోలీస్ కస్టడీ లో ఉంచి హింసిస్తూ వున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కేసులు రాజీ పోవాలి, ఆ భూములను పూర్తిగా వదులుకోవాలని డిమాండ్ చేసి ఒప్పు కోక పొతే అతని ప్రాణాలు తీయడానికైనా నాగరాజు అతని అనుచరుల చెప్పుచేతల్లో ఉన్న సి.ఐ  పథకం వేశారు.

 

 

ఈ విషయంగా మాల మహానాడు నాయకులు మునిరత్నం  ద్వారా 9 వ తేదీన  డి వై ఎస్పీ (DSP) కి మహాజరు సమర్పించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శన్  స్వయంగా డి.వై ఎస్పీ (DSP) కి సమస్య వివరించి పేదలకు న్యాయం చేయాలని కోరారు.వెంటనే పై అధికారులు జోక్యం చేసుకోకుంటే దళిత నాయకుడు బి.మునిరత్నాన్ని మట్టు పెట్టడానికైనా వైసీపీ నాయకుడు నాగరాజు అతని అనుచరులు వెనుకాడడం లేదు మునిరత్నం ప్రాణానికి ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. 22 వ తేదీన అదుపులో తీసుకొన్న పోలీసులు ఇంతవరకు కోర్టులో ఎందుకు హాజరు పరచలేదు.  జిల్లా కలెక్టర్ ,  జిల్లా ఎస్పీ  తగు చర్య గై కొనాలి. మునిరత్నం ప్రాణాల్ని కాపాడాలి. ఈ విషయంగా ప్రజాస్వామ్య వాదులు, జిల్లా లోని దళిత సంఘాలు తగు చర్యలు గైకొవాలని మాల మహానాడు కోరడమైనది.

 

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: CI should be held responsible if anything happens to Dalit leader Muniratnam ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page