పుంగనూరులో నో మాస్క్ డ్రైవ్ చేయకండి.. మాస్క్ ధరించి సహకరించండి..

0 9,723

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రతి నిత్యం కరోన రక్కసి కబంధ హస్తలలో చిక్కుకుని మొదటి దశ మరియు రెండవ దశ లలో ఇప్పటికే మనము ఎందరినో కోల్పోయాము.రాబోయే మూడవ దశ నుండి మనల్ని మనతో పాటు చుట్టూ ఉన్న అందరిని కాపాడే దిశలో భాగంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి , మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ, మిథున్ రెడ్డి వారి సలహా సూచనలు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేర ప్రతి రోజు నో మాస్క్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని కోరుతూ పుంగనూరు నందు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ ఆధ్వర్యంలో సచివాలయ మరియు మున్సిపల్ సిబ్బంది తో కలసి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఈ నో మాస్క్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం పట్టణంలో ని ప్రవేటు బస్టాండ్, గోకుల్ సర్కిల్,మూడెప్ప సర్కిల్,నాగపాళ్యం తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కె.ఎల్ వర్మ మాట్లాడుతూ ప్రతి రోజు ఇంటి వెలుపల రాగానే మాస్క్ ధరించడం మన దినచర్యగా భావించి అందరు కరోన నివారణ చర్యలలో భాగంగా మన ఆరోగ్యం తో పాటు అందరి ఆరోగ్యం కాపాడేందుకు సహకరించాలని కోరారు. అలాగే మాస్క్ ధరించకుండా వాహనదారులు, పాదచారులు తిరగరాదని అట్లు తిరిగిన వారికి అవగాహన కల్పిస్తూ నూరు రూపాయల అపరాధ రుసుము విధించడం జరుగుతున్నదని తెలిపారు.ప్రజలు కరోన నివారణకు సహకరించి పట్టణంలో ప్రజలు ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని కోరారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: Do not drive no mask in Punganur .. Wear a mask and cooperate ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page