బంగాళాఖాతంలో భూకంపం..

0 7,568

చెన్నై ముచ్చట్లు :

బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని వివరించింది. ఏపీలోని కాకినాడకు దక్షిణ-ఆగ్నేయ దిశలో 296 కిలోమీటర్లు, రాజమండ్రికి దక్షిణ-ఆగ్నేయంగా 312 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపకేంద్రం ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:Earthquake in the Bay of Bengal ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page