పార్టీ నిర్మాణంపై ఫోకస్

0 9,744

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పాలనలో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు.. ఇక పార్టీపై పోకస్ చేశారు. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమో దు, డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌.. పార్టీ శ్రేణులు , కార్యకర్తలతో పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజురాబాద్‌ ఉపఎన్నికల అంశాలపై చర్చించారు. అదే విధంగా దళిత బంధు పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దళిత బంధు పథకం అమలులో పార్టీ శ్రేణుల బాధ్యతలేమిటి… విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.కాగా, ఈ సందర్బంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రశాఖల పునర్నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ మార్గదర్శం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ సంస్థాగత నిర్మాణానికి మంగళవారం జరిగే సమావేశంలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక, ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళితబంధు పథకం అమలు తీరుతెన్నులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన కృషిపై అధినేత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధాకర్తగా పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలో అధినేత వెల్లడించారు.

 

 

- Advertisement -

పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యే సమావేశంలో దళితబంధు ప్రాధాన్యతలు, పథకం రూపకల్పన వెనక ఉద్దేశ్యాలను కేసీఆర్ వివరించారు. ఇప్పటికే పథకం అమలుపై పలుమార్లు సమీక్ష నిర్వహించిన సీఎం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిగిలిన గ్రామాల మాదిరిగా దళిత కాలనీలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా సొమ్మును పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బీమా సంస్థలకు అందజేశారు.

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags; Focus on party structure

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page