30న కపిలితీర్ధంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

0 7,479

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 30వ తేదీ గోకులాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ ఉత్స‌వాన్ని ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.ఇందులో భాగంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు స్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.

 

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:Gokulashtami celebrations at Srivenugopalaswamy Temple in Kapilithirtha on the 30th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page