తెలియక చేసిన తప్పుకు 14 ఏళ్లుగా జైల్లోనే..

0 8,757

దుబాయి ముచ్చట్లు :

అనుకోకుండా జరిగిన తప్పు అతడ్ని దశాబ్దానికి పైగా కటకటాల వెనక్కి నెట్టింది. కేరళ రాష్ట్రం ఇరింజలకుడ కన్నికులంగరాకు చెందిన గోపాల క్రిష్ణన్, నయారంబలంకు చెందిన చంద్రన్ మంచి స్నేహితులు. వారిద్దరూ చాలా ఏళ్లుగా అబుధాబిలో ఒకే రూంలో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో 2007లో జరిగిన ఓ ఘటన గోపాల క్రిష్ణన్ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఒకరోజు మిత్రుడు చంద్రన్ తన రూంలోనే ఉండే ఆంధ్ర వ్యక్తితో ఓ విషయమై ఘర్షణకు దిగాడు. వారిద్దరూ అలాగ గొడవ పడుతున్న సమయంలో గోపాల క్రిష్ణన్ కిచెన్‌లో ఉన్నాడు. చాకుతో కూరగాయలు కట్ చేస్తున్న క్రిష్ణన్‌కు స్నేహితుడు చంద్రన్ గట్టిగా అరవడం వినిపించింది. దాంతో చేతిలో చాకుతో పాటే ఆయన బయటకు వచ్చాడు. వచ్చి చూసేసరికి స్నేహితుడు చంద్రన్, ఆంధ్ర వ్యక్తి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. దాంతో చంద్రన్‌ను వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు క్రిష్ణన్. ఆ సమయంలో క్రిష్ణన్ చేతిలో ఉన్న చాకు చంద్రన్‌కు బలంగా గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడిన చంద్రన్‌‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. అతను చనిపోయాడు. దీంతో చంద్రన్ మృతికి కారణమైన క్రిష్ణన్‌ను దుబాయ్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

 

Tags:He was jailed for 14 years for an unintentional mistake.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page