అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో డ‌బ్బులు జమ

0 8,558

అమరావతి ముచ్చట్లు :

అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రూ.666.84 కోట్ల న‌గ‌దు జ‌మ చేశారు. ల‌క్ష‌లాది మంది బాధితుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ మాట్లాడుతూ కష్టపడి సంపాదించుకున్న‌ సొమ్మును అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు నష్టపోయారని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించామని, వారిని ఆదుకుంటున్నామ‌ని వైఎస్ జ‌గ‌న్ తెలిపారు. రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.86 లక్షల మంది బాధితులకు రూ.207.61 కోట్లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే, రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన 3.14 లక్షల మంది బాధితులకు రూ.459.23 కోట్లు చెల్లించామని వివ‌రించారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:Money deposited in Agrigold victims’ accounts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page