ఆర్టీసీకీ రాఖీ ఆదాయం 12 కోట్లు

0 8,553

హైదరాబాద్ ముచ్చట్లు :
రాఖీ పండగ సందర్భంగా ఆదివారం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లతో పాటు తెలంగాణ ఆర్టీసీ కూడా పండగ చేసుకుంది. కరోనా వైరస్ మొదలైన తర్వాత తొలిసారి భారీస్థాయిలో ఆదాయం ఆర్జించింది. ఇంతకీ ఆదివారం టీఎస్ఆర్టీసీకి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా.. రూ.12.34 కోట్లు. ఆదివారం ఆర్టీసీ బస్సులు 31.15 లక్షల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించగా.. టిక్కెట్ల రూపంలో రూ.12.34 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. సంస్థకు ఇటీవల కాలంలో అత్యధిక ఆదాయం కావటం విశేషం.ఆర్టీసీ అధికారుల అంచనా ప్రకారం.. సంస్థకు రోజువారీగా రూ.13 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. టికెట్ల ధర పెంచినా అంత ఆదాయం రావడంలేదు. కరోనా తగ్గిన తరువాత కూడా ప్రజలు ప్రయాణాలకు అంతగా మొగ్గుచూపడం లేదు. శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు పెద్దసంఖ్యలో ఉండటంతో ఆదాయం భారీగా వస్తుందని అధికారులు అంచనా వేసినా నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో ఆదివారం భారీ మొత్తంలో ఆదాయం రావడం అధికారుల్లో ఉత్సాహాన్ని నింపింది. సాధారణంగా వారంలో సోమవారం అధికంగా ఆదాయం వస్తుంటుందని, అయితే ఆదివారం రాఖీ పండగ కూడా ఉండటంతో భారీగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

 

- Advertisement -

Tags:Rakhi revenue to RTC is Rs 12 crore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page