పుంగనూరు మున్సిపాలిటిలోని ఒకొక్క వార్డుకు రూ.5లక్షలు -చైర్మన్‌ అలీమ్‌బాషా

0 8,820

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలోని ఒకొక్క వార్డులో మౌళిక వసతుల ఏర్పాటుకు రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. మంగళవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. చైర్మన్‌ మాట్లాడుతూ 31 వార్డుల్లో అత్యవసర పనులు చేపట్టేందుకు రూ.5 లక్షలు విడుదల చేయాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారని తెలిపారు. కౌన్సిలర్లు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. కౌన్సిలర్‌ అమ్ము మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మీషన్లు పెరుగుతోందని , ఇందుకు తగినంతగా ఉపాధ్యాయులను నియమించాలన్నారు. కౌన్సిలర్‌ కాంతమ్మ మాట్లాడుతూ యూబికాంపౌండులో విద్యుత్‌ స్తంభాలు మార్చాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కౌన్సిలర్లు అర్షద్‌అలీ, తుంగా మంజునాథ్‌ మాట్లాడుతూ రాజకాలువల్లో పూడికతీయ్యాలని, పూడిపోవడంతో వర్షపునీరు ఇండ్లలో చేరుతోందన్నారు. నక్కబండ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కౌన్సిలర్‌ మనోహర్‌ కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్‌.లలిత, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags; Rs 5 lakh for each ward in Punganur Municipality – Chairman Aleem Basha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page