పుంగనూరులో వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు సామ్రాట్‌ ఆత్మహత్య

0 8,672

పుంగనూరు ముచ్చట్లు:

 

మండల వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు, సుగాలిమిట్ట సర్పంచ్‌ గౌరమ్మ భర్త సామ్రాట్‌(55) సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగునెలల క్రితం సామ్రాట్‌ కుమారులు ఇరువురు రోజుల వ్యవధిలో మరణించారు. దీని కారణంగా తీవ్రమనస్థాపానికి గురైన సామ్రాట్‌ ఇప్పటికే రెండు సార్లు పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో కోలుకున్నాడు. ఇలా ఉండగా సోమవారం రాత్రి ఇంటి వద్ద గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో సుగాలిమిట్టలో విషాదం అలుముకుంది. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పలువురు సంతాపం….

వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు సామ్రాట్‌ మృత్యువార్త తెలియగానే వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్సి పెద్దిరెడ్డి, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించి సంతాపం తెలిపారు.

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: Samrat, YSRCP leader, commits suicide in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page