సంజనా, రాగిణిలు ఎడిక్ట్…

0 8,632

హైదరాబాద్ ముచ్చట్లు:

సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్‌ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఏడాది క్రితం శాండల్‌వుడ్‌లో డగ్స్‌ కేసు వార్త ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురి చేసింది. నటి రాగిణి ద్వివేది సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాగిణి పేరు కూడా ప్రచారంలోకి రావడంతో వారిద్దరికీ నోటీసులు పంపారు. ఇక నటి సంజన ఆప్తుడు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి రాహుల్‌ను కూడా సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో సంజన కూడా డ్రగ్స్‌ తీసుకుందంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారుఇదిలా ఉంటే తాజాగా ఈ డ్రగ్స్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ ఇద్దరు హీరోయిన్లకు మరోసారి ఉచ్చు బిగుస్తోంది. రాగిణి, సంజనలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) తాజాగా రిపోర్ట్‌ విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం రాగిణి, సంజనలు డ్రగ్స్‌ సేవించినట్లు తేలింది. ఇదిలా ఉంటే 2020 అక్టోబర్‌లో వీరిద్దరి వెంట్రకల నమూనాలను సేకరించిన బెంగళూరు పోలీసులు ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించారు. తాజాగా వీరు ఇచ్చిన రిపోర్ట్స్‌లోవారిద్దరు డ్రగ్స్ సేవించినట్లు తేలింది. డ్రగ్స్‌ సేవించినట్టు రిపోర్ట్ రావడంతో బెంగళూరు పోలీసులు మరోసారి వీరిద్దరికీ సమన్లు జారీ చేయనున్నారు. ఇదిలా ఉంటే రాగిని పెద్దగా తెలుగు ప్రేకకులకు పరిచయం లేకపోయినప్పటికీ సంజన మాత్రం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన బుజ్జిగాడుతో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించి సుపరిచురాలిగా మారిన విషయం తెలిసిందే.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: Sanjana, Raginilu Edict …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page