కేంద్రమంత్రి పై ఇంకు చల్లిన మహిళ

0 11

బీహార్ ముచ్చట్లు :

లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీలిక నేత, కేంద్రమంత్రి పశుపతి పరాస్ పై ఓ మహిళ ఇంకుతో దాడిచేసింది. కేంద్ర మంత్రివర్గంలో చేరిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గమైన బీహార్‌లోని హాజీపూర్ లో పర్యటించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న హాజీపూర్ రాగా చిరాగ్ పాశ్వాన్ మద్దతురాలు అయిన మహిళ పశుపతి పరాస్ పై ఇంకు చల్లింది. దీంతో ఆయన ధరించిన కుర్తాపై ఇంకు మరకలు పడ్డాయి. కాసేపటి తర్వాత మంత్రి తన దుస్తులు మార్చుకుని యథావిధిగా తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు, నియోజకవర్గంలో పర్యటించిన ఆయనకు అడుగడుగునా నిరసనలు వినిపించాయి.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:The woman who sprayed ink on the Union Minister

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page